హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. బైక్ వెళుతూ డివైడర్ ను ఢీకొట్టి కిందపడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు, మృతుల బంధువులు దీని గురించి పోలీసులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా విప్పర్ల గ్రామానికి చెందిన బాల ప్రసన్న (24), గుంటూరు జిల్లా మరిచెట్టు పాలెం గ్రామానికి చెందిన రోహిత్(26) ఇద్దరునగరంలోని హఫీజ్ పేట్ లో ఉంటున్నారు. వీరిలో రోహిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా, బాల ప్రసన్న ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. వీరిద్దరూ ఆదివారం తెల్లవారుజామున మజీ బండ వైపు నుండి ద్విచక్ర వాహనంపై హఫీజ్ పేట్ వైపు వేగంగా వస్తుండగా కొత్తగూడ ఫ్లైఓవర్ గోడను ఢీకొని పై నుండి కింద పడ్డారు.
కిందపడిన రోహిత్, బాల ప్రసన్న తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీ సులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ రోహిత్, ప్రసన్న మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ లో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.