sukhibhava Sharath : 'అయ్యయ్యో వద్దమ్మా' .. సుఖీభవ కుర్రాడి పై దాడి..!
sukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో "అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.;
sukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో "అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. నల్లగుట్ట శరత్ అనే యువకుడు ఓ టీపౌడర్ యాడ్ ని రీక్రియేట్ చేసి తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇది వైరల్‌గా మారడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిన నల్లగుట్ట శరత్ పైన దాడి జరిగింది. శరత్తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. ఎదో ఫంక్షన్‌లో గొడవ జరిగిందని, అక్కడ శరత్ పైన దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.