యూపీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!
యూపీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు పూజారి బాబా సత్యనారాయణను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.;
యూపీ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు పూజారి బాబా సత్యనారాయణను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో బాబా సత్యనారాయణతో పాటుగా మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ఎస్టీఎఫ్ సహా పలు పోలీసు బృందాలు రాష్ట్రమంతటా రెండు రోజులుగా గాలించాయి. ఆచూకీ చెబితే రూ .50,000 రివార్డ్ అని ప్రకటించినప్పటికీ పోలీసులు బాగా శ్రమించాల్సి వచ్చింది. అయితే పూజారి మాత్రం గత రెండు రోజులుగా అదే గ్రామంలో దాక్కున్నాడు. కాగా, ఆలయానికి వెళ్లిన 50 ఏళ్ల అంగన్‌వాడీ మహిళ పైన సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసి ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయారు దుండగులు.. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం ఉదయం వెలుగు చూసింది.