Karnataka: భార్య ప్రేమికుడి గొంతు కోసి, అతని రక్తం తాగి..
కట్టుకున్న భార్య మరొకరితో ప్రేమాయణం సాగిస్తోంది. మాటలతో వినే రకం కాదనుకున్నాడు..
కట్టుకున్న భార్య మరొకరితో ప్రేమాయణం సాగిస్తోంది. మాటలతో వినే రకం కాదనుకున్నాడు.. అతనిలోని క్రూరత్వాన్ని నిద్ర లేపాడు.. అతడి గొంతు కోసి రక్తం తాగాడు.కర్నాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో అన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గొంతు కోసి అతని రక్తం తాగుతున్నప్పుడు అతని స్నేహితుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో బంధించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
విజయ్ అనే నిందితుడు మారేష్‌తో తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. జూన్ 19న విజయ్ తన స్నేహితుడు జాన్‌తో కలిసి మారేష్‌ను సమీపంలోని అడవికి తీసుకెళ్లి అక్కడ మారేష్ గొంతు కోసాడు.బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మారేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయ్‌ని అరెస్ట్ చేశారు.