శ్రీకాకుళం జిల్లాలో వన్యప్రాణులను తరలిస్తున్న ముఠా కలకలం రేపింది. ఒడిశా నుండి బెంగుళూరుకు కారులో గుట్టు చప్పుడు కాకుండా వన్యప్రాణులను తరలిస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. వీరిని ఇచ్చాపురం చెక్‌పోస్టు వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వన్యప్రాణులు అన్నీ ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 17 కొండచిలువలు, ఒక అడవి పిల్లి తోపాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నాయి. ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశా లో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.