సద్గురు డీప్‌ఫేక్ వీడియోకు ఆకర్షితురాలై ఆన్ లైన్ లో రూ.3.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ..
ఆధ్యాత్మిక గురువు ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థతో వ్యాపారం చేస్తున్నట్లు చూసి ఆమె కూడా ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి కోట్లు పోగొట్టుకుంది.
ఆధ్యాత్మిక గురు జగ్గీ వాసుదేవ్ AI- జనరేటెడ్ డీప్ ఫేక్ వీడియోను ఉపయోగించి తనను మోసం చేసి రూ.3.75 కోట్లు దోచుకున్నారని CV రామన్ నగర్ నివాసి అయిన వర్ష గుప్తా సైబర్ క్రైమ్ పోలీసులకు వివరించింది.
డీప్‌ఫేక్ టెక్నాలజీ గురించి తెలియని గుప్తా ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఆధ్యాత్మిక గురువు డీప్‌ఫేక్ వీడియోలో తాను ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థతో వ్యాపారం చేస్తున్నానని తలిపాడు. దానిపట్ల ఆమె కూడా ఆకర్షితురాలై లింక్ పైకి వెళ్లి తన వివరాలను సమర్పించింది.
అనంతరం మిర్రాక్స్ యాప్ ప్రతినిధి UKకి చెందిన అనేక నంబర్లు మరియు వివిధ ఇమెయిల్ చిరునామాల నుండి ఆమెను సంప్రదించి, ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా ఆమెకు మార్గనిర్దేశం చేశారని వర్ష పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
మిర్రాక్స్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 మరియు ఏప్రిల్ 23 మధ్య, ఆ మహిళ తన బ్యాంకు ఖాతాల నుండి మొత్తం రూ.3,75,72,121లను ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అప్లికేషన్‌లో పెట్టుబడి పెట్టింది. లాభాలను ఉపసంహరించుకోలేనప్పుడు మాత్రమే తాను మోసపోయానని గ్రహించింది.
ఆమె ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్లు మరియు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 318 (4) (మోసం) కింద కేసు నమోదు చేయబడింది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.