LOANS: మీకు తెలియకుండానే మీ పేరుపైనే లోన్లు

ఇటీవల కాలంలో పెరుగుతున్న లోన్ మోసాలు... పాన్ కార్డుతో లోన్ తీసుకుంటున్న నేరగాళ్లు... పాన్ కార్డు క్రెడిట్ రిపోర్టుతో లింక్... క్రెడిట్ రేటింగ్, రుణ సామర్థ్యంపై ప్రభావం

Update: 2026-01-10 08:00 GMT

కొందరికి అప్పు అంటే భయం. దాని జోలికి కూడా వెళ్లరు. అయితే ఇటీవల కాలంలో లోన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. మీకు తెలియకుండానే మీ పాన్‌ ‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌ మీద మోసగాళ్లు లోన్లు తీసుకుంటున్నారు. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మీ పాన్ కార్డ్ ద్వారా ఎవరైనా అనుమతి లేకుండా లోన్ తీసుకున్నారా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పాన్‌ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో ఇలా తెలుసుకోండి. ఆన్‌లైన్ లోన్ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్‌తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా లోన్ మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.

క్రెడిట్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను చెక్ చేసుకోవాలి

క్రె­డి­ట్ రి­పో­ర్ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను ఎప్ప­టి­క­ప్పు­డు చెక్ చే­సు­కో­వా­లి. సి­బి­ల్‌­‌­‌­‌­‌­‌­‌‌, ఎక్స్‌­‌­‌­‌­‌­‌­‌­‌­పీ­రి­య­న్‌­‌­‌­‌­‌­‌­‌‌, ఈక్వి­ఫా­క్స్‌­‌­‌­‌­‌­‌­‌‌, క్రి­ఫ్‌­‌­‌­‌­‌­‌­‌‌ హై మా­ర్క్‌­‌­‌­‌­‌­‌­‌‌ వంటి క్రె­డి­ట్ బ్యూ­రో­లు మీ పే­రు­తో తీ­సు­కు­న్న అన్ని లో­న్లు, క్రె­డి­ట్ కా­ర్డుల వి­వ­రా­ల­ను మే­నే­జ్ చే­స్తా­యి. వాటి వె­బ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­సై­ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ల­లో­కి వె­ళ్లి పాన్, మొ­బై­ల్ నెం­బ­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­తో ధృ­వీ­క­రణ చేసి, ఏడా­ది­కి ఒక­సా­రి ఉచిత క్రె­డి­ట్ రి­పో­ర్ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను పొం­దొ­చ్చు. మీరు దర­ఖా­స్తు చే­య­ని లో­న్లు లేదా క్రె­డి­ట్ కా­ర్డు­లు, తప్పు ఖాతా నం­బ­ర్లు, తె­లి­య­ని రు­ణ­దా­తల పే­ర్లు, లేదా మీరు ఆమో­దిం­చ­ని కొ­త్త హా­ర్డ్ ఎం­క్వై­రీ­లు వం­టి­వి క్రె­డి­ట్ రి­పో­ర్ట్‌­లో ఉం­డొ­చ్చు. వీ­టి­ని జా­గ్ర­త్త­గా చెక్ చే­సు­కో­వా­లి. మీకు తె­లి­య­కుం­డా తీ­సు­కు­న్న లో­న్లు ఉంటే చర్య­లు తీ­సు­కో­వా­లి. ఏమా­త్రం ఏమ­రు­పా­టు­గా ఉన్నా మీ పే­రు­పై­నే లో­న్లు తీ­సు­కు­ని మోసం చే­స్తా­రు జా­గ్ర­త్త.

మీ పేరుపై లోన్లు తీసుకుంటే..

మీరు నకి­లీ లో­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను గు­ర్తి­స్తే వెం­ట­నే సం­బం­ధిత ఫై­నా­న్షి­య­ల్ సం­స్థ­కు తె­లి­య­జే­యా­లి. రి­పో­ర్ట్ చే­సిన క్రె­డి­ట్ బ్యూ­రో వద్ద ఇష్యూ రైజ్ చే­యా­లి. చాలా వి­వా­దా­ల­ను క్రె­డి­ట్ బ్యూ­రోల వె­బ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­సై­ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌ల ద్వా­రా ఆన్‌­‌­‌­‌­‌­‌­‌­‌­లై­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­లో దా­ఖ­లు చే­యొ­చ్చు. గు­ర్తిం­పు­ను తె­లి­య­జే­సే డా­క్యు­మెం­ట్లు, లోన్ వి­వ­రా­లు, సం­త­కం చే­సిన అఫి­డ­వి­ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను సమ­ర్పిం­చా­లి. అద­నం­గా, స్థా­నిక పో­లీ­స్ సై­బ­ర్‌­‌­‌­‌­‌­‌­‌­‌­క్రై­మ్ సె­ల్‌­‌­‌­‌­‌­‌­‌­‌­లో పాన్ దు­ర్వి­ని­యో­గా­ని­కి సం­బం­ధిం­చిన ఫి­ర్యా­దు­ను దా­ఖ­లు చేసి, ఆధా­రా­ల­ను సమ­ర్పిం­చా­లి. ఎవ­రై­నా మీ పా­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను చట్ట­వి­రు­ద్ధం­గా ఉప­యో­గిం­చి లోన్ తీ­సు­కుం­టే మీ క్రె­డి­ట్ స్కో­ర్‌­‌­‌­‌­‌­‌­‌‌ తగ్గి­పో­తుం­ది. ని­జ­మైన లో­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ల­ను పొం­ద­డం కష్టం­గా మా­రు­తుం­ది. ప్ర­తి 3-6 నె­ల­ల­కు ఒక­సా­రి క్రె­డి­ట్ రి­పో­ర్ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను చెక్ చే­సు­కో­వా­లి. ప్ర­తి క్రె­డి­ట్ బ్యూ­రో నుం­చి సం­వ­త్స­రా­ని­కి ఒక­సా­రి ఉచి­తం­గా రి­పో­ర్ట్ పొం­దొ­చ్చు. క్ర­మం తప్ప­కుం­డా తని­ఖీ చే­య­డం­తో మో­సా­న్ని గు­ర్తిం­చి, ని­వా­రిం­చొ­చ్చు.

అసు­ర­క్షిత సై­ట్లు, యా­ప్‌­లు లేదా వా­ట్సా­ప్ ఫా­ర్వా­ర్డ్‌­ల­లో మీ పాన్ కా­ర్డు నం­బ­ర్‌­ను ఎప్పు­డూ పం­చు­కో­వ­ద్దు. బహి­రం­గం­గా షేర్ చే­య­డం, ఎవ­రి­కీ ఇవ్వొ­ద్దు. మీ పాన్ కా­ర్డు పోతే, రీ­ప్రిం­ట్ కోసం దర­ఖా­స్తు చే­యం­డి. ఆ సమ­యం­లో కొ­న్ని నె­ల­లు మీ క్రె­డి­ట్ రి­పో­ర్ట్‌­ను సమీ­క్షిం­చం­డి. ఫై­నా­న్షి­య­ల్ అకౌం­ట్‌­ల­కు బల­మైన పా­స్‌­వ­ర్డ్‌­ల­ను సె­ట్‌ చే­సు­కోం­డి.

Tags:    

Similar News