Dubbaka Suicide:ఉద్యోగం దొరకట్లేదన్న బాధతో యువకుడి ఆత్మహత్య.. అతడి సూసైడ్ నోట్‌లో..
Dubbaka Suicide: ఉద్యోగం లేదన్న బాధతో మరో నిరుద్యోగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.;
Dubbaka Suicide (tv5news.in)
Dubbaka Suicide: ఉద్యోగం లేదన్న బాధతో మరో నిరుద్యోగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటి పరిధిలోని చెల్లాపూర్ కు చెందిన రాకేష్ యాదవ్ డిగ్రీతో పాటు ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తి చేశాడు. హైదరాబాద్ లో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఎక్కడా ఉద్యోగం దొరకకపోవడంతో రాకేష్ మనస్తాపం చెందాడు. నిన్న సాయంత్రం పొలం దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు చిన్న అన్న నాగరాజుకు లోకేషన్ షేర్ చేశాడు. రాకేష్ జేబులో సూసైడ్ నోట్ గుర్తించారు కుటుంబసభ్యులు. నాకు ఉద్యోగం లేదు. నాన్న..అన్నలు జాగ్రత్త..అమ్మ పైలం అంటూ లేఖలో రాశాడు.