PM Modi : యువతిపై 23 మంది అత్యాచారం.. స్పందించిన మోదీ

Update: 2025-04-11 10:30 GMT

యూపీ వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. వారణాసిలో ల్యాండ్ కాగానే ఈ ఘటనపై పోలీసులు, కలెక్టర్‌తో మాట్లాడారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తనను కిడ్నాప్ చేసి ఆరు రోజుల పాటు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి 23 మంది అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా వారణాసి పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. 70 ఏళ్లు దాటిన ముగ్గురు లబ్ధిదారులకు ఆయష్మాన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘కాశీ నాది..నేను కాశీకి చెందినవాడిని’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. వారణాసి మోదీ సొంత నియోజకవర్గం. 2014 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు అక్కడి నుంచి విజయం సాధించారు.

Tags:    

Similar News