అంజన్‌కుమార్ యాదవ్‌ను విచారించిన ఈడీ
తాను యంగ్ ఇండియాకు 20 లక్షల విరాళం ఇచ్చానని.. అన్ని లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు.;
తెలంగాణ కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్‌ను ఈడీ విచారించింది. ఢిల్లీలోని కార్యాలయంలో రెండు గంటల పాటు ప్రశ్నించింది. యంగ్ ఇండియా సంస్థకు 20 లక్షల విరాళంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే.. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. తాను యంగ్ ఇండియాకు 20 లక్షల విరాళం ఇచ్చానని.. అన్ని లెక్కలు ఉన్నాయని స్పష్టం చేశారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు.
కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని.. గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని.. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.