సీఎం జగన్‌పైకి షర్మిలను ఎక్కు పెట్టే ప్లాన్‌లో కాంగ్రెస్
వైఎస్ షర్మిల వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుంది. ఏపీ లో జగన్ పైకి షర్మిళ ను ఎక్కుపెట్టే ప్లాన్ లో కాంగ్రెస్ చర్చలు;
కర్ణాటకలో విజయం సాధించినాక కాంగ్రెస్‌లో నూతనుత్సాహం పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ దక్షిణాదిలో మరింత బలపడేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనబడుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల వైపు హైకమాండ్ మొగ్గు చూపుతుంది. ఏపీ లో జగన్ పైకి షర్మిళ ను ఎక్కుపెట్టే ప్లాన్ లో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. వైఎస్ వారసురాలిగా షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ద్వారా పార్టీకీ దూరమైన వర్గాలను చేరువ చేసుకునేందుకు సన్నద్ధమైతోంది.
సీఎం జగన్‌కు వైఎస్ అస్త్రంతోనే కాంగ్రెస్ షాక్ ఇవ్వనుంది. షర్మిల పార్టీని కలిపేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిళ ముందుకు పార్టీ విలీనం ప్రతిపాదన తీసుకువచ్చింది. ఈ విషయంపై షర్మిలతో నేరుగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ చర్చించింది. వీరిద్దరి చర్చకు డీకే శివకుమార్ మధ్యవర్థిత్వం చేశారనే సమాచారం. ప్రియాంకా గాంధీతో షర్మిల సుదీర్ఘ మంతనాలు జరిపింది. అయితే పార్టీ విలీనానికి షర్మిళ సుముఖంగా లేదు కానీ టీ కాంగ్రెస్‌తో పొత్తుకు మాత్రం సిద్ధంగా ఉన్నాని దాని తరువాతే ఏపీ కాంగ్రెస్‌పై ఫోకస్ పెడతానని ప్రియాంకతో మాట్లాడినట్లు సమాచారం.