Editorial: మలక్‌పేట బీజేపీలో టికెట్ ఫైట్
బీజేపీలో టికెట్ కోసం ఆశావహుల మధ్య పోటీ;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతోబీజేపీలో టికెట్ కోసం ఆశావహుల మధ్య పోటీనెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న మలక్ పేట నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలో దిగేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. మలక్ పేట నియోజకవర్గంలో 2 లక్షల 76 వేల మంది ఓటర్లు ఉన్నారు.మలక్ పేట నియోజకవర్గం ఒకప్పుడు బీజేపీ కి ,కాంగ్రెస్ కంచుకోట. ఉమ్మడి మలక్ పేట నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఇంద్రసేనా రెడ్డి , కాంగ్రెస్ నుంచి సుధీర్ కుమార్ , మల్ రెడ్డి రంగారెడ్డి పలు మార్లు MLA లుగా విజయం సాధించారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత మలక్ పేట నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోట గా మారింది. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లోMIM నుంచి బలాల విజయం సాధిస్తున్నారు. 2020 డిసెంబర్ లో జరిగిన GHMC ఎన్నికల్లో మలక్ పేట నియోజకవర్గంలోని సైదాబాద్ , మూసారాంబాగ్ డివిజన్ల లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మలక్ పేట లో బీజేపీ జెండా ఎగురవేసి ఎంఐఎం కంచుకోట ను బద్దలు కొట్టేందుకు బీజేపీ నేతలు తహతహలాడుతున్నారు.
భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడైన సంరెడ్డి సురేందర్ రెడ్డి ....మలక్ పేట బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. RSS బ్యాగ్రౌండ్ ఉన్న సురేందర్ రెడ్డి...మొదటి నుంచి బీజేపీ లోనే ఉంటూ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జిల్లా ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. సేవాయి సంఘటన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటు లో ఉండే తనకే మలక్ పేట బీజేపీ టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు సంరెడ్డి సురేందర్ రెడ్డి.
భాగ్యనగర్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ అయిన సందడి.సురేందర్ రెడ్డి...మలక్ పేట టికెట్ రేసులో నేను ఉన్నానంటున్నారు. RSS కార్యకర్త స్థాయి నుంచి జిల్లా జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన సురేందర్ రెడ్డి.... SKR ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ....పేదలకు అండగా నిలుస్తున్నారు. మలక్ పేట ప్రజలకు అందుబాటు లో ఉంటూ....పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తనకే బీజేపీ అధిష్టానం మలక్ పేట టికెట్ ఇస్తుందని సందడి.సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయిన కొత్తకాపు రవీందర్ రెడ్డి...మలక్ పేట టికెట్ రేసులో ఉన్నారు. రవీందర్ రెడ్డి భర్య అరుణ 2020 GHMC ఎన్నికల్లో సైదాబాద్ కార్పొరేటర్ గా విజయం సాధించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కొత్తకాపు రవీందర్ రెడ్డి...కరోనా సమయంలో మలక్ పేట నియోజకవర్గంలోని పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. వాలీ బాల్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన కొత్తకాపు రవీందర్ రెడ్డి.....ఈ సారి మలక్ పేట బీజేపీ టికెట్ తనకే దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన లింగాల హరి గౌడ్ సైతం మలక్ పేట బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. OBC మీడియా సెల్ కన్వీనర్ గా పని చేస్తున్న హరి గౌడ్... బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. 2014 లో మలక్ పేట YCP అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ లో చేరిన హరిగౌడ్ ... రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల కేబుల్ టీవీ ఆపరేటర్స్ ప్రెసిడెంట్ గా 15 ఏళ్ళ నుంచి పని చేస్తున్న లింగాల హరిగౌడ్ ...ప్రజలతో సత్సంబంధాలు నెరుపుతున్నారు బీజేపీ అధిష్ఠానం మలక్ పేట టికేట్ తనకే ఇస్తుందని ధీమాతో ఉన్నారు.
హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ గా పని చేసిన సుభాష్ చందర్ జీ ...కూడా మలక్ పేటలో బీజేపీ తరపున బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీ లో సీనియర్ నాయకుడు, వివాదరహితుడు అయిన తనకే తనకే మలక్ పేట టికెట్ వస్తుందని సుభాష్ చందర్ జీ ధీమా తో ఉన్నారు.
మొత్తం మీద MIM కి కంచుకోట అయిన మలక్ పేటలో బీజేపీ టికెట్ రేసులో ఉన్న నాయకులు ఒక వైపు సేవా కార్యక్రమాలు చేస్తునే....మరో వైపు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి బీజేపీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి.