సీఎస్ సోమేష్‌కు హైకోర్ట్ షాక్
ప్రస్తుతం తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.;
తెలంగాణలో ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఆయన కొనసాగుందెఎ హైకోర్టు నిరాకరించింది. సోమేష్ కుమార్‌ను కేంద్రం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను సోమేష్ ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేస్తూ తెలంగాణలో సోమేష్ కొనసాగేందుకు క్యాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో ఆయన తెలంగాణలో కొనసాగుతున్నారు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు ఇచ్చింది..