Tamil Nadu: తమిళనాడులో 50 సీట్లలో బీజేపీ పోటీ..?

Update: 2025-08-08 17:15 GMT

02026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు.. పొత్తులు, పోటీ చేసే స్థానాలపై కసరత్తు చేస్తున్నాయి. ఇక్కడి రాజకీయాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు శాసిస్తాయి. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలిచింది. ప్రస్తుతం స్టాలిన్ సీఎంగా ఉన్నారు. ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తామని.. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు టీవీకే పార్టీ ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అంటోంది. బీజేపీ సైతం తమిళనాడులో కాషాయ జెండా ఎగురవేయ్యాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం బీజేపీ అన్నాడీఎంకే పోత్తులో ఉన్నాయి. అయిన కూడా బీజేపీ డబుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. ఓ వైపు పొత్తు ఓటు బ్యాంకును పెంచుకుంటునే.. అన్నామలై లాంటి డైనమిక్ లీడర్ లను గ్రౌండ్‌లోకి దింపి.. సొంతంగా ఓటు బ్యాంకును పెంచుకుంటుంది.

గత ఎన్నికలతో పోల్చుకుంటూ.. తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. అదే జోష్ తో ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పొత్తుతో పాటు పోటీ చేసే స్థానాల అంశంలో కూడా దూకుడుగా వ్యవహారిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ పొత్తులో భాగంగా 50కి పైగా సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. 2021 ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు స్థానాలను పెంచుకోవాలని కమలం పార్టీ చూస్తోంది. సీట్ల పంపకంపై ఇప్పటికే రెండు పార్టీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై అటు బీజేపీ లేదా ఇటు ఏఐడీఎంకే ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మాట్లాడుతూ.. తమిళనాడులో 2026 ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో అన్నాడీఎంకే ఎడప్పాడి కె. పళనిస్వామి నాయకత్వంలో జరుగుతాయని ప్రకటించారు. అయితే బీజేపీ ప్రతిష్టాత్మక సీట్ల డిమాండ్ కు ఏఐడీఎంకే అంగీకరిస్తుందా..? అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News