BSNL : బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ .. రూ.1కే అన్లిమిటెడ్ కాల్స్

Update: 2025-08-02 08:15 GMT

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇండిపెండెన్స్డ్ సందర్భంగా కొత్త ప్లాన్ ను తీసుకొ చ్చింది. 'బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్' పేరిట దీన్ని లాంచ్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ ప్లాన్లో భాగంగా రూ.1కే 30 డేస్ అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, రోజుకు 2 జీబీ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆసక్తి గల కస్టమర్లు ఈ ఆఫర్ కోసం సమీపం లోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కు లేదా రిటైలర్ ను సందర్శించొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4జీ సేవలను విస్తరించడమే లక్ష్యం గా సంస్థ ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్/STD), రోజుకు 2 GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS మరియు ఉచిత BSNL సిమ్ ఉన్నాయి. BSNL 4G నెట్‌వర్క్ భారతదేశంలోనే స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడి, అభివృద్ధి చేయబడి, విస్తరించబడుతోంది. ఇది "ఆత్మనిర్భర్ భారత్ మిషన్"లో భాగంగా ఉందని BSNL ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ A. రాబర్ట్ J. రవి పేర్కొన్నారు.

Tags:    

Similar News