Chhattisgarh Government : సన్నీ లియోన్‌ ఖాతాలో నెలకు రూ.వెయ్యి జమ

Update: 2024-12-23 11:30 GMT

పోర్న్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోయిన్ గా రాణిస్తున్న సన్నీ లియోన్ గురించి అందరికీ తెలుసు. ఆమె పేరుతో ఉన్న ఓ ఖాతాలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలకు రూ.1000 జమ చేస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ ను అక్కడి అధికారులు లబ్దిదారుగా ఎంపిక చేశారు. నెలనెలా ఆమె ఖాతాలో రూ. వెయ్యి జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ కు సంబంధం ఏంటి.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే డౌట్ మీకు రావచ్చు. ఐతే.. చత్తీస్ గఢ్ అధికారులకు ఆ డౌట్ రాలేదు. నెలనెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమచేస్తోంది. బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డట్లు తేలింది. ఓ యువకుడు సన్నీ లియోన్ పేరు, ఫొటో లతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా.. అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు. కాగా, ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. 

Tags:    

Similar News