Former Minister Roja Daughter : మాజీ మంత్రి రోజా కూతురు ర్యాంప్ వాక్

Update: 2025-02-08 15:30 GMT

మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక మల్టీ ట్యాలెంట్‌తో అదరగొడుతున్నారు. వెబ్‌ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె తాజాగా ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ’గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌’లో ఆమె ర్యాంప్‌‌పై నడిచి ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్‌లో అన్షు షేర్ చేశారు. ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు సైతం అందుకున్నారు.

తల్లి రోజా రాజకీయాల్లో ఎంత పేరు తెచ్చుకున్నారో, అన్షు కూడా తన రంగాల్లో విజయపథంలో సాగుతున్నారు. ఆమె సృజనాత్మకత, తన కష్టపడి పనిచేసే నైపుణ్యం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో, ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. మొత్తంగా, అన్షు మాలిక తాను ఎంట్రీ ఇచ్చిన ప్రతి రంగంలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News