హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పెరిగి రూ.77,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 పెరగడంతో రూ.84,330 పలుకుతోంది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,07,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పెరిగింది. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2,763 డాలర్లుగా ఉండగా, శుక్రవారం కూడా 2,795 కి పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.50 డాలర్లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.