సినీ రచయిత చిన్నికృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది.ఆయన తల్లి సుశీల (75) ఇవాళ తెల్లవారు జామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వారి స్వగ్రామం తెనాలిలో ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. సుశీల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నా రు. చిన్నికృష్ణకు తల్లితో అనుబంధం ఎక్కువ. అమ్మప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నోసార్లు కవితలు రాశారు. జన్మజన్మలకు నీకే జన్మించాలని ఉందంటూ మదరే సంద్భర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.