Heavy rains : కర్ణాటకలో దంచికొడుతున్న వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కొడగు, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు.
ఇక బెంగళూరు, మైసూరు, మాండ్య సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఒడిశా, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ భారీ వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పింది. న్ 1 నుంచి జులై 17 వరకు దేశవ్యాప్తంగా 468.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణమైన 440.8 మి.మీ. కంటే ఎక్కువ.