Grand Cherokee SUV : జీప్ గ్రాండ్ చెరోకీపై భారీ డిస్కౌంట్

Update: 2024-11-04 14:15 GMT

కార్లపై పండుగ ఆఫర్లు ముగిసినా... కొన్ని కంపెనీలు మాత్రం ఇప్పటికీ తమ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందజేస్తున్నాయి. ఇందులో జీప్ గ్రాండ్ చెరోకీ ఒకటి. ఈ ఎస్‌యూవీపై కంపెనీ12 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఒక పరిమిత వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తుంది. రూ.12 లక్షల నగదు తగ్గింపు తర్వాత, దాని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ. 67.50 లక్షలుగా మారింది. మీరు ఈ ప్రీమియం, లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే, ఇది ఉత్తమ అవకాశం. జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ 2.0-లీటర్ టర్బో చార్జ్ డ్ పెట్రోల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. 268 బీహెచ్ పీ గరిష్ట పవర్ , 400 ఎన్ఎం పీక్ టార్క్యూను ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ టార్క్యూ కన్వర్టర్ ఉంటుంది. క్వాడ్రాటాక్ 4×4 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్‍లకు పవర్ చేరుతుంది. ఏడు స్లాట్ల ఫ్రంట్ గ్రిల్, క్లామ్‍షెల్ బొనెట్, బాక్సీ సిల్హొయెట్‍తో జీప్ గ్రాండ్ చెరోకీ.. డిజైన్‍పరంగా ఆకర్షణీయంగా ఉంది.

Tags:    

Similar News