ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న కేంద్రహోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిటస్ను ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్ ల కు కేంద్రహోంశాఖ పంపించింది. తాజాగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖను ఆదేశించింది. తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవం తానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.