మీరు రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నికల్లో పోటీ చేయండి.. ఈసీపై కేజ్రీ ఫైర్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజకీయాలు చేయాలనుకుంటే ఢిల్లీలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.;

Update: 2025-01-30 09:55 GMT

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజకీయాలు చేయాలనుకుంటే ఢిల్లీలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. 

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యమునా వివాదంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సంబంధించి గురువారం పెద్ద ప్రకటన చేశారు. ఎన్నికల సంఘం రాజకీయాలు చేస్తోందన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఉద్యోగం కోసం చూస్తున్నారని, అందుకే రాజకీయాలు చేస్తున్నారన్నారు.

ఎలక్షన్ కమిషన్ ఇంతగా నాశనమైందని నేను అనుకోను. రెండు రోజుల్లో నన్ను జైల్లో పెడతారని నాకు తెలుసు. వాళ్ళు పెట్టనివ్వండి, నేను భయపడను. వారికి మూడు బాటిళ్ల యమునా వాటర్ కూడా పంపిస్తున్నాం. ఇలాంటి ఎన్నికలను దేశం గతంలో ఎన్నడూ చూడలేదలని కేజ్రీ అన్నార

Tags:    

Similar News