కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాలకు ఎలాంటి వసతులు కల్పిస్తుందో మనందరం చూస్తున్నాం. వైసీపీ హయాంలో ఏకంగా టీటీడీలోనే కుంభకోణాలు వెలుగు చూశాయి. ఎలాంటి వసతులు కల్పించకుండా భక్తులను నానా ఇబ్బందులు పెట్టారు వైసీపీ నేతలు. కానీ కూటమి హయాంలో బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత భక్తులకు పెద్ద పీట వేస్తున్నారు. సామాన్య భక్తులకు తొందరగా దర్శనం అయ్యేలా చూస్తున్నారు. అంతే కాకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు టీటీడీ తరహాలోనే ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో కూడా నిత్యాన్నదానం ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు. టీటీడీ నిధులతో ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఒంటిమిట్టకు వచ్చే భక్తులకు ఈ ఏర్పాట్లు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ నాయుడు గారు. అందుకే ఇప్పుడు ఒంటిమిట్టకు వచ్చే భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తరహాలోనే ఒంటిమిట్టలో కూడా నిత్యన్నదానం మూడు పూటలా అందజేయబోతున్నారు. ఒంటిమిట్టకు పూర్వ వైభవం తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. వైసీపీ హయాంలో ఒంటిమిట్టను సరిగ్గా పట్టించుకోలేదు.. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వైసీపీ నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే.
కాబట్టి ఇప్పుడు ఒంటిమిట్టకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు. దీన్ని బట్టి హిందూ ఆలయాలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది అందరికీ అర్థం అవుతోంది. వైసీపీ హాయంలో హిందూ ఆలయాలపై దాడులు తప్ప సౌకర్యాలు అన్న మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు కూటమి హయాంలో హిందూ ఆలయాలకు పెద్ద పీట వేస్తూ ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.