బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న హీరోలు హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఏంటని మండిపడ్డారు. మీకు ఎందుకు ఇంత కక్కుర్తి అంటూ ఫైర్ అయ్యారు.వీళ్ళ ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా సంపాదించిన వందల కోట్లను.. చారిటీల ద్వారా ఖర్చు చేయాలని కోరారు.