ఔషధాల ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డ్రగ్స్ కంట్రోల్ సిద్ధమవుతోంది. దేశంలో అత్యధిక మంది వాడే షుగర్ మాత్రలతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలు తదితర మెడిసిన్స్ రేట్లు ప్రియం కానున్నాయి. వీటి ధరలు 1.7శాతం పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ తెలిపారు. మరో 2,3 నెలల్లో కొత్త రేట్లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల ఉల్లంఘనలకు సంబంధించి 307 ఘటనలను ఫార్మా డ్రగ్స్ ధరలను ఖరారు చేసే నియంత్రణ సంస్థ నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్‌పీపీఏ) కనుగొంది. డ్రగ్ ప్రైసెస్(కంట్రోల్) ఆర్డర్(డీపీసీఓ), 2013 ప్రకారం ఫార్మసీ డ్రగ్స్‌కు ధరలపై గరిష్ఠ పరిమితి ఉంటుంది. తయారీ సంస్థలు ఈ ధరకు మించి ఉత్పత్తులను అమ్మరాదు.