ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2025-2026వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం తీసుకుంది. గత త్రైమా సికంలో 26 బిలియన్ల లాభం సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగించడం గమనార్హం. కంపెనీ నిర్వహణ స్థాయిని తగ్గించి, కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కోంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు పనిచే స్తున్నారు. వీరిలో 3.9% ఉద్యోగులను నిన్న తొలగించింది. ఈ ఏడాదిలో మొత్తం 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఏడీపి ( ఆటోమేటిక్ డేటా ప్రోసెసింగ్ ) సంస్థ నివేదించింది. మార్చి క్వార్టర్లీలో కంపెనీ 70 బిలియన్ డాలర్ల ఆదాయంలో 26 బిలియన్ డాలర్ల నికరలాభం ఆర్జించింది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం సాధించడానికి, బృందాలను సిద్దం చేయడానికి ఈ మార్పులు అవసరమని, ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 80బిలియన్ల పెట్టుబడులు పెడుతూ, కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తోందని తెలిపింది.