సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలయ్య హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హిందూపురం వచ్చిన సందర్భంగా తనకు పద్మభూషణ్ అవార్డు కంటే నాన్న ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు రావడం ప్రధానమని చెప్పారు. ఖచ్చితంగా ఆయనకు భారతరత్న వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎందుకంటే నాన్న చేసిన పాత్రలు మరువలేనివని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని ఇంకా విభిన్న పాత్రలతో ప్రేక్షక దేవుళ్ళను మెప్పిస్తానని ఆయన తెలిపారు. తనకు తానే పోటీ పడి పాత్రలు పోషిసున్నా అన్నారు. తనకు ఎవరూ పోటీలేరన్నారు. అదేవిధంగా నా సేవలు ఒక హిందూపురంలోనే కాదని రాష్ట్రమంతా అవసరమైతే పార్టీ కోసం శ్రమిస్తానన్నారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి తన ఆకాంక్షని ఆయన తెలిపారు. చివరిగా నాన్నకి భారతరత్న రావడం ఖాయమని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎందుకంటే అటువంటి గొప్ప నటుడు ఇక పుట్టబోడని ఆయన ఒక అవతార పురుషుడు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.