Police Advise : ఇళ్ల వద్దే 31 వేడుకలు చేసుకోండి.. పోలీసుల సూచన

Update: 2024-12-31 07:15 GMT

డిసెంబర్ 31 రాత్రి టైంలో సెలబ్రేషన్స్ పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ చేయొద్దని పోలీసులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్లపై వేడుకలకు అనుమతి లేదన్నారు. రోడ్లపైకి చేరి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. పోలీసుల ఆంక్షలను కాదని రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలకు నగరాల్లో, జిల్లా కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Tags:    

Similar News