Ram Charan : కాంపా బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

Update: 2025-04-12 11:15 GMT

రిలయన్స్ గ్రూప్ నకు చెందిన బేవరేజెస్ బ్రాండ్ కాంపా డ్రింక్ కు తెలుసు సినిమా హీరో రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిం చనున్నారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రామ్ చరణ్ భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో కాంపా ప్రయాణంలో మైలురాయి లాంటిదని తెలిపింది.

2023 మార్చిలో మార్కెట్ లోకి కంపా డ్రింక్ ను రిలయన్స్ తిరిగి తీసుకు వచ్చింది. ఈ డ్రింక్ ను మరింత విస్తరిం చాలని రిలయన్స్ నిర్ణయించింది. మిలీనియల్స్ జన్ జడ్ను చేరుకోవాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రామ్ చరణ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. దీని ద్వారా ఈ బ్రాండ్ ను మరింత విస్తృతంగా మార్కెట్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది. రామ్ చరణ్ కాంపా వాలి జిద్ పేరుతో ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది. 2022 లో కాంపా బ్రాండ్ ను రిలయన్స్ కొనుగోలు చేసింది.

Tags:    

Similar News