సీఎం.జగన్ పర్యటనలో మీడియాపై ఆంక్షలు
సీఎం జగన్ పర్యటనకు అధికారులు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు;
సీఎం జగన్ పర్యటనలో అధికారులు మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ ప్రోగ్రాంలు, బహిరంగ సభల్లో ప్రజలు పారిపోతున్న విషయం తెలిసిందే..ఈ దృశ్యాలను ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ లు చిత్రీకరణ చేస్తారని సమాచార శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో సీఎం జగన్ పర్యటన పై మీడియాపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రోగ్రాంకి కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ లు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. సమాచారశాఖ అధికారుల తీరుపై జర్నలిస్టుల నిరసనకు దిగారు.కెమెరామెన్ లకు అనుమతి లేకుంటే తామూ రామంటూ జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.