బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. మ.12 గంటలలోగా ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న ఆయన తన నివాసంలో కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు రెండు సర్జరీలు చేసినట్లు డాక్టర్లు ఇదివరకే ప్రకటించారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను ఆయన ఇంటికి తీసుకొచ్చి క్రైమ్‌సీన్ రీక్రియేషన్ చేశారు.
యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను అతడి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. క్రైమ్ సీక్వెన్స్‌లో భాగంగా అంతకు ముందే నేషనల్ కాలేజ్ బస్టాప్, బాంద్రా రైల్వే స్టేషన్ సహా మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఆదివారం పోలీసులు అతడిని థానేలో అరెస్టు చేశారు. సైఫ్‌ను అతడు ఆరుసార్లు కత్తితో పొడవడం తెలిసిందే.
సైఫ్‌పై దాడికి సంబంధించిన విచారణలో భాగంగా పలు ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో భాగంగా వేలిముద్రలు సేకరించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సైఫ్ భవనాన్ని సందర్శించినట్లు ఓ అధికారి తెలిపారు. దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు లభించాయన్నారు. ఇంట్లోని కిటికీలపై, ఇంట్లోకి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.