రిషబ్ పంత్‌ను కాపాడిన వ్యక్తి పరిస్థితి విషమం.. ప్రియురాలితో కలిసి ఆత్మహత్యా యత్నం

వారిద్దరూ ప్రేమించుకున్నారు కానీ వారి కులాలు వేరు కావడంతో వారి కుటుంబాలు వారి సంబంధాన్ని తిరస్కరించాయి. దాంతో వాళ్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు.;

Update: 2025-02-13 11:29 GMT

భారత క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఘోర ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన ప్రియురాలితో కలిసి విషం తాగాడని ఆరోపణలు ఉన్నాయి . 

2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనప్పుడు 25 ఏళ్ల రజత్ కుమార్ అతని ప్రాణాలను కాపాడాడు. 

ఫిబ్రవరి 9న, కుమార్ మరియు అతని స్నేహితురాలు మను కశ్యప్ (21) తమ సంబంధాన్ని పెద్దలు వ్యతిరేకిస్తున్నారని కలత చెంది విషం తాగారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఇరువురిని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతున్న సమయంలో అతని స్నేహితురాలు మను కశ్యప్ మరణించింది, కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. అతడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

నివేదిక ప్రకారం, ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో వారి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించలేదు. అయితే కశ్యప్ తల్లి కుమార్ తన కుమార్తెను కిడ్నాప్ చేసి విషం ఇచ్చి చంపాడని ఆరోపించింది.

డిసెంబర్ 2022లో, కుమార్ రిషబ్ పంత్‌ను ప్రమాదం నుండి కాపాడాడు, ఘోరమైన ఆ ప్రమాదంలో రిషబ్ ప్రాణాలతో బయటపడ్డాడంటే దానికి కారణం కుమార్. పంత్ ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌కు వస్తుండగా, అతని మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొట్టి మండుతోంది.

ప్రమాదాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు వెంటనే వచ్చి సహాయం చేసి, కాలిపోతున్న వాహనం నుండి అతన్ని బయటకు తీశారు. అతడికి వెంటనే వైద్య సహాయం అందేలా చూశారు. రిషబ్ ను కాపాడిన ఆ జంట సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. తరువాత పంత్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు.

పొందండితాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్ మరియు టాప్ హెడ్‌లైన్స్‌తో టైమ్స్ నౌలో ప్రత్యక్ష ప్రసారంమహాకుంభ్ 2025,ఢిల్లీ ఎన్నికలు,భారతదేశంమరియు ప్రపంచవ్యాప్తంగా.

Tags:    

Similar News