Dil Raju : గేమ్ చేంజర్ ప్రి-రిలీజ్ ఈవెంట్ లో విషాదం.. మృతులకు దిల్ రాజు సాయం

Update: 2025-01-06 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ప్రమాదం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈవెంట్ కు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్‌ జరిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరి మృతిపై ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు దిల్‌ రాజు. ఆ కుటుంబాలకు 5 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. వారికి డగా ఉంటామని దిల్‌ రాజు తెలిపారు. 

Tags:    

Similar News