8 Things for healthy lifestyle: మీ దినచర్యను ఇలా ప్లాన్ చేసుకుంటే.. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు..

8 Things for healthy lifestyle: మీ రోజువారీ ఉదయపు దినచర్య మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి సహకరిస్తుంది. మీ రోజువారీ దినచర్యను పరిపూర్ణంగా చేయడానికి 8 అంశాలు ఇక్కడ ఉన్నాయి.

Update: 2022-09-19 07:15 GMT

8 Things for healthy lifestyle: మీ రోజువారీ ఉదయపు దినచర్య మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి సహకరిస్తుంది. మీ రోజువారీ దినచర్యను పరిపూర్ణంగా చేయడానికి 8 అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. నీరు త్రాగండి

మీరు రోజంతా తగినంత నీరు త్రాగుతారు. కానీ ముఖ్యంగా మీరు నిద్ర నుండి మేల్కొన్న వెంటనే కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి. మన శరీర అవయవాలు, కణజాలాలన్నీ ఉత్తమంగా పనిచేయడానికి నీరు తోడ్పడుతుంది. మంచం మీద నుండి దిగి నేరుగా కిచెన్‌లోకి వెళ్లి ఒక గ్లాసు నీటిని గోరువెచ్చగా చేసి తాగడం వల్ల రోజంతా శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి తోడ్పడుతుంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంట ఒక బాటిల్‌ను తీసుకెళ్లండం మాత్రం మరిచిపోకూడదు.

2. వాకింగ్ లేదా జాగింగ్

పొద్దున్నే లేచి, జాగింగ్ చేయడానికి లేదా ఒక మైలు పరుగెత్తడానికి సమయాన్ని వెచ్చించండి. ఇది మీ కండరాలను బలపరుస్తుంది. మీరు ఫిట్‌గా ఉండటానికి తోడ్పడుతుంది. ప్రతిరోజు రన్నింగ్, సైక్లింగ్ లేదా జాగింగ్ చేయడం వల్ల గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిరూపించబడింది.

3. ధ్యానం, యోగా సాధన

ధ్యానం ఒత్తిడిని దూరం చేస్తుంది. మనస్సును ప్రకృతికి ట్యూన్ చేస్తుంది. సూర్యోదయానికి ముందు ధ్యానం, యోగా వంటివి చేయడం వలన శరీరం, మనసు ఆరోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటాయి.

4. ఆయిల్ పుల్లింగ్

ఆయిల్ పుల్లింగ్ అనేది ఆయుర్వేద మౌత్ వాష్. ఇది బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తుంది. ఇది మీ నోటి యొక్క pH స్థాయిలను నిర్వహిస్తుంది. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆయిల్ పుల్లింగ్ అనేది మీ నోటికి ఒక చిన్న వ్యాయామం. మీరు దీనిని మిస్ చేయకూడదు.

5. ఆవిరి చికిత్స

మిమ్మల్ని వైరస్ వంటి వ్యాధుల నుండి దూరంగా ఉంచడమే కాకుండా మొటిమలు, నల్లటి వలయాలు, మచ్చలు ఆవిరితో దూరమవుతాయి. చర్మ రంద్రాల్లో పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

6. ముఖ మసాజ్ / శుభ్రపరచడం

మీ పళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రతి రోజు ఉదయం ఆవిరి పట్టిన తరువాత ఓ ఐదు నిమిషాలు ముఖాన్ని గాఢత తక్కువ ఉన్న ఆయిల్‌తో మసాజ్ చేసుకోండి. ఇది మీ ముఖానికి మెరుపుని తెస్తుంది.

7. సన్‌స్క్రీన్‌ను ఎప్పటికీ మర్చిపోకండి

ఏ సీజన్‌ అయినా సన్‌స్క్రీన్ రాసుకోకుండా బయటకు వెళ్లకండి. సన్‌స్క్రీన్ మీ ముఖాన్ని హానికరమైన రేడియేషన్‌ నుండి రక్షిస్తుంది.

8. అన్నిటికంటే ముఖ్యమైనది అల్పాహారాన్ని స్కిప్ చేయకపోవడం..

అల్పాహారం రోజంతటికీ కావలసిన శక్తిని ఇస్తుంది. ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండటానికి ప్రతిరోజూ ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోండి. మీకు సమయం లేకుంటే, కొన్ని పండ్ల ముక్కలను కట్ చేసి ఓట్ మీల్‌తో కలిపి తినండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యం ఉంచుతుంది. 

Tags:    

Similar News