అల్పాహారంలో ఓ కప్పు 'మఖానా ఖీర్'.. ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అన్నీ ఒకే దానిలో..
ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే ఆరోజంతా ఆనందంగా, ఉత్సాహంగా పని చేసుకుంటారు. శరీరం అలసటకు గురికాకుండా ఉంటుంది.;
అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్ మరియు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలు ఉండాలి. ఉదయం తీసుకునే మొదటి భోజనం రోజంతా శక్తినిచ్చేలా ఉండాలి. మీరు ఖాళీ కడుపుతో తీసుకునే మొదటి ఆహారం శరీరం గ్రహించడానికి తోడ్పడుతుంది. అందుకే అల్పాహారంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మంచిది. మీరు అల్పాహారాన్ని సులభంగా, పోషకాలతో కూడినదిగా రుచికరంగా చేయాలనుకుంటే, ఒక కప్పు మఖానా ఖీర్ తినండి.
అల్పాహారంలో మఖానా ఖీర్ మీకు పూర్తి శక్తిని ఇస్తుంది. ఇది రోజంతా శరీరంలో ఉండే బలహీనతను తొలగిస్తుంది. మీరు ఉపవాసం సమయంలో కూడా మఖానా ఖీర్ తినవచ్చు. దీనిని సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు.
దీనిని తయారు చేయడానికి మీకు 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మఖానా ఖీర్ తినడం వల్ల ఉదయం ప్రోటీన్, విటమిన్లు మరియు కాల్షియం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. మఖానా ఖీర్ పిల్లలు మరియు పెద్దలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం.
మఖానా ఖీర్ తయీరు చేయడం ఎలాగో చూద్దాం..
మఖానా ఖీర్ చేయడానికి, 1 కప్పు మఖానాలు తీసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి మఖానాలను వేయించాలి. మఖానాలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. దీనివల్ల ఖీర్ రుచి బాగుంటుంది.
తరువాత డ్రైప్రూట్స్ జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలు కూడా నేతిలో కొద్దిగా వేయించాలి. ఇవి మఖానా ఖీర్‌కు మరింత ఆరోగ్యాన్ని, రుచిని తీసుకువస్తాయి. అన్నీ వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టి, అదే పాన్‌లో పాలు పోసి మరిగే వరకు ఉంచాలి.
పాలు మరిగేటప్పుడు, మఖానాను ఒకసారి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయండి.. మరీ మెత్తని పొడి మాదిరిగా కాకుండా చేయాలి. అనంతరం మరిగే పాలలో ఈ మఖానా వేయాలి.
మఖానా చిక్కబడే వరకు ఉడికించి, రుచికి రుచికి తగ్గట్టుగా ఏలకులపొడి తగినంత చక్కెర లేదా బెల్లం జోడించండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా ఖీర్‌ను చిక్కగా చేసుకోండి. మీరు మఖానా ఖీర్‌కు కొంచెం చిరోంజర్ సీడ్స్ (సారపప్పు) కూడా జోడించవచ్చు.
దీనివల్ల ఖీర్ మరింత రుచిగా ఉంటుంది. శీతాకాలంలో వేడి వేడి మఖానా ఖీర్ తినండి. వేసవిలో మఖానా ఖీర్ కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి తినండి. టేస్ట్ సూపర్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరూ ట్రై చేయండి మఖానా ఖీర్.