Weight Loss Drinks: వాటర్‌తో వెయిట్ లాస్.. వండర్‌ఫుల్ ఐడియా బాస్..

Weight Loss Drinks: ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు ఓ లీటర్ తాగేయండి.. ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది అని అంటారు.. నిజమే కానీ లీటర్ అంటే కష్టం బాసూ.. కడుపులో తిప్పేస్తుంది అని వాయిదా వేస్తున్నారా..

Update: 2022-09-12 11:41 GMT

Weight Loss Drinks: ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లు ఓ లీటర్ తాగేయండి.. ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది అని అంటారు.. నిజమే కానీ లీటర్ అంటే కష్టం బాసూ.. కడుపులో తిప్పేస్తుంది అని వాయిదా వేస్తున్నారా.. మరి ఓవర్ వెయిట్ ఎలా కంట్రోల్ చేస్తారు.. అందుకే మీకోసం మరికొన్ని వాటర్ ఐడియాస్ తీసుకొచ్చారు డైటీషియన్లు.. అవేంటో చూద్దాం. ఆచరణలో కూడా పెట్టేద్దాం.. ఓ నాలుగు రోజులు చేసేసి వామ్మో వల్ల కావట్లేదు అని పక్కన పెట్టేయకండి.. ఏది చేసిన కచ్చితంగా ఓ 40 రోజులు చేస్తే అలవాటైపోతుంది. రిజల్ట్ కూడా వస్తుంది.. ప్రయత్నించండి..

1. కలోంజి సీడ్ వాటర్ 


గ్లాసు నీటిలో 3 నుండి 4 కలోంజి గింజల చూర్ణం, ఆపై నిమ్మరసం కొద్దిగా తేనె వేసి ప్రతిరోజూ త్రాగాలి.

2. యాపిల్ సైడర్ వెనిగర్‌


గోరువెచ్చని నీటిలో ఓ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ప్రతి రోజూ ఉదయం తాగండి.

3. యాపిల్, దాల్చినచెక్క


మీరు రోజంతా తాగాలనుకున్న నీటిలో యాపిల్ ముక్కలు మరియు దాల్చిన చెక్క వేసి ఉంచండి. ఆ నీటిని రోజంతా సిప్ చేస్తూ ఉండండి.

4. ఏలకులు


మరిగించిన నీటిలో కొన్ని ఏలకులు వేసి ఉదయం లేదా రాత్రి త్రాగుతుండాలి.

5. నిమ్మరసం, తేనె


గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం తేనె కలిపి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి

6. స్ట్రాబెర్రీ, పుదీనా


స్ట్రా బెర్రీలు, పుదీనాని నీటిలో వేసి ఆ నీటిని తాగొచ్చు. స్ట్రాబెర్రీ తినేయొచ్చు.

7. జీలకర్ర నీరు


జీలకర్రను నీళ్లలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి. ఈ నీరు రోజుకు లీటర్ చొప్పున తాగాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. 

Tags:    

Similar News