Hair loss in men: పురుషుల్లో బట్టతల.. చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకుంటే..

Hair loss in men: ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడిపోతుంటే ప్రాణం ఉసూరుమంటుంది.. అయ్యో ఏం చెయ్యాలి ఇప్పుడు అని అద్దం ముందు కూర్చుని చింతిస్తుంటారు బట్టతల ఉన్న పురుష పుంగవులు.

Update: 2023-01-18 08:48 GMT

Hair loss in Men: ఉన్న నాలుగు వెంట్రుకలు కూడా ఊడిపోతుంటే ప్రాణం ఉసూరుమంటుంది.. అయ్యో ఏం చెయ్యాలి ఇప్పుడు అని అద్దం ముందు కూర్చుని చింతిస్తుంటారు బట్టతల ఉన్న పురుషులు. చక్కెర-తీపి పానీయాలు పురుషుల జుట్టు రాలడానికి ప్రధాన కారణం అని పరిశోధనలు చెబుతున్నాయి. న్యూట్రియెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..



సోడాలు/శీతల పానీయాలు, చక్కెర కలిపిన జ్యూస్, స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, స్వీట్ మిల్క్, టీ/కాఫీతో సహా పురుషులలో జుట్టు రాలడానికి హేతువులు అవుతాయని పేర్కొంది. బీజింగ్‌లోని సింఘువా యూనివర్శిటీ పరిశోధకులు చైనాలో నిర్వహించిన ఈ అధ్యయనంలో 13-29 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో చక్కెర తీపి పానీయాల వినియోగం అత్యధికంగా ఉందని తేలింది.



2022 జనవరి నుండి ఏప్రిల్ వరకు 18-45 సంవత్సరాల మధ్య వయస్సున్న వక్తుల జీవనశైలి అలవాట్ల కారణంగా జుట్టు రాలడాన్ని గమనించారు. బెంగుళూరు బన్నెరఘట్ట రోడ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ కన్సల్టెంట్ డెర్మటాలజీ డాక్టర్ సుధీంద్ర జి ఉద్బాల్కర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ఈ పానీయాలు ప్రభావితం చేస్తాయి. దాని కారణంగా జుట్టు రాలుతుంది అని పేర్కొన్నారు.



జుట్టు రాలడాన్ని నివారించడానికి విటమిన్ సి, ఐరన్, జింక్‌తో సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్య అని ఆయన తెలిపారు. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రధానం అని డాక్టర్ ఉద్బాల్కర్ చెప్పారు.




జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ఆహార చరిత్రను పరిశీలించాలి. పోషకాల లోపానికి సంబంధించిన శారీరక పరీక్ష చేయించుకోవాలి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న వ్యక్తుల్లో జుట్టు రాలడం తీవ్రంగా ఉంటుంది. అధిక చక్కెర తీసుకోవడం వలన అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది.

Tags:    

Similar News