Mobile phones: మొబైల్ ఎక్కువగా వాడుతున్న పురుషుల్లో.. నపుంసకత్వం

Mobile phones: మొబైల్ వాడకం ఎక్కువైతే క్యాన్సర్‌తో పాటు నపుంసకత్వానికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు

Update: 2022-03-05 06:00 GMT

Mobile Phones: లేచింది మొదలు పడుకునే వరకు మొబైల్‌తోనే ఎక్కువగా గడుపుతుంటారు చాలా మంది.. ఉద్యోగ భాగంలో కొందరైతే, కాలక్షేపానికి మరికొందరు.. అధికంగా మొబైల్ వాడకం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసినా మొబైల్‌కి బాగా అడిక్షన్ అయిపోతున్నారు.. ఈ విషయంలో ఎవరికి వారే నియంత్రణలో ఉండాలి. మొబైల్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం వంటి వాటిపై విపరీత ప్రభావం చూపుతుంది. తాజా పరిశోధనల్లో మరో కొత్త విషయం వెల్లడైంది. స్త్రీ, పురుషుల్లో సంతానలేమికి కారణం అవుతుంది.

ఇటీవల యుఎస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ మొబైల్ ఫోన్‌లను శరీరానికి చాలా అడుగుల దూరంలో ఉంచమని ప్రజలకు సూచించింది. మొబైల్ ఫోన్లు తక్కువ-ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని ఎక్సేంజ్ చేసుకుంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియలో, ఆరోగ్యానికి ప్రమాదకరమైన రేడియేషన్ ఉంది. రేడియేషన్ పిల్లల ఆరోగ్యంపై మరింత ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

సమాచార ప్రసారానికి మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ స్థాయిలలో బాగా తగ్గుతుంది అనేది నిజం అయినప్పటికీ, మొబైల్ ఫోన్లు నిరంతరం ఉపయోగించడం, శరీరానికి చాలా దగ్గరగా ఉండటం వలన, ఈ రేడియేషన్ ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటి వరకు చాలా దేశాల్లో జరిపిన అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ సేపు మొబైల్ ఫోన్లను జేబులో పెట్టుకునే పురుషుల్లో స్పెర్మ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.

దీన్ని నివారించడానికి, మొబైల్‌లో మాట్లాడటానికి స్పీకర్‌ఫోన్ లేదా హెడ్‌సెట్‌ని ఉపయోగించమని సూచిస్తున్నారు. లేదా ఫోన్‌ను మీ చెవులు, తల నుండి దూరంగా ఉంచండి. వీలైనంత వరకు మొబైల్‌లో మాట్లాడే బదులు మెసేజ్ చేయండి. మొబైల్ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాంట్ జేబులో లేదా షర్ట్ జేబులో పెట్టవద్దు. దానికి బదులు బ్యాగ్‌లో ఉంచి తీసుకెళ్లండి. మొబైల్ ఫోన్‌ని ఉపయోగించనప్పుడు, దాన్ని ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి మార్చడమో లేదా స్విచ్ ఆఫ్ చేయడమో చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News