Amazing Natural Pain Killers: అన్నింటికీ డాక్టర్ అవసరం లేదు.. అద్భుతమైన నాలుగు నేచురల్ పెయిన్ కిల్లర్స్‌తో..
Amazing Natural Pain Killers: ఒళ్లు నొప్పులు, ఒంట్లో నలతగా ఉండడం, తరచుగా తలనొప్పి, ముక్కు దిబ్బడ ఇవన్నీ సహజంగా అందరికీ వస్తుంటాయి.. ఇవి రాకుండా ముందుగానే సరైన జీవనశైలిని అలవరుచుకుంటే చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.;
Amazing Natural Home Remedies: ఒళ్లు నొప్పులు, ఒంట్లో నలతగా ఉండడం, తరచుగా తలనొప్పి, ముక్కు దిబ్బడ ఇవన్నీ సహజంగా అందరికీ వస్తుంటాయి.. ఇవి రాకుండా ముందుగానే సరైన జీవనశైలిని అలవరుచుకుంటే చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలు జోడిస్తే సీజనల్ వ్యాధులు మీ దరి చేరవు. ఇంటి చిట్కాలు అని ఈజీగా తీసిపారేయకండి. అవే భారతీయులకు ఆయుర్వేద వైద్యులు, అమ్మమ్మ, నాయనమ్మలు అందించిన అద్భుతమైన వరాలు.. వాటి గురించి తెలుసుకుందాం.. ఆచరించే ప్రయత్నం చేద్దాం.
తరచుగా వైద్యుని వద్దకు వెళ్లే అవసరం ఉండకూడదు.. నొప్పి ఎక్కువ రోజులు ఉండటం లేదా భరించలేనిదిగా ఉంటే తప్పని సరిగా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. సాధారణ నొప్పులకు సహజ చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి. అవి..
లవంగాలు: లవంగ నూనె వికారం నుండి ఉపశమనం కలిగించే ఉత్తమ మూలికా సప్లిమెంట్లలో ఒకటి. పంటి నొప్పి నివారణకు అద్భుతమైన ఔషధం. పంటి నొప్పి బాధిస్తున్నప్పుడు ఒక లవంగాన్ని నొప్పి ఉన్న భాగంలో ఉంచి పై పంటితో గట్టిగా అదిమి పెట్టాలి. లవంగం నూనె ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సమర్థవంతంగా పని చేస్తుంది.
పసుపు: ఇందులో కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్ అణువుల నుండి శరీరాన్ని కాపాడుతుంది. వాపును, మంటను తగ్గిస్తుంది. పసుపు సప్లిమెంట్ రూపంలో కూడా లభిస్తుంది. అయితే స్వచ్ఛమైన పసుపుకు కొన్ని నల్ల మిరియాలు జోడించి తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఐస్ ప్యాక్: నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ప్యాక్ ఉంచినట్లైతే నొప్పి, వాపు తగ్గుతుంది. ఐస్ ప్యాక్‌తో పాటు వేడి నీటి కాపడం కూడా పెట్టినట్లైతే శరీరంలోని ఆయా భాగాల్లో నొప్పి తగ్గి రిలీఫ్ వస్తుంది.
అల్లం: అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లం, వెల్లుల్లి జోడించిన ఆహార పదార్థాలకు రుచి ఏమాదిరిగా వస్తుందో, అలాగే కీళ్లు మరియు కండరాల నొప్పులను తగ్గించడానికి అల్లం అద్భుతంగా పని చేస్తుంది. వికారం, మార్నింగ్ సిక్‌నెస్ ఉన్నవారికి అల్లంతో తయారు చేసిన మురబ్బాను చిన్న ముక్క ప్రతి రోజు తీసుకుంటే చాలా బాగా పని చేస్తుంది. టీ తాగే అలవాటు ఉన్నవారు పంచదారకు బదులు బెల్లం, అల్లంతో తయారు చేసిన టీ తాగితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవు.