Hair Care Tips: జుట్టు పెరగాలంటే కాస్త కత్తిరించాల్సిందే..

Hair Care Tips: జుట్టును బాగా పెంచుకోవాలని, దానికి అందంగా స్టైలింగ్ చేయాలని అందరికీ ఉంటుంది.

Update: 2021-10-26 03:05 GMT

Hair Care Tips (tv5news.in)

Hair Care Tips: జుట్టును బాగా పెంచుకోవాలని, దానికి అందంగా స్టైలింగ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఈరోజుల్లో చాలామందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్ని చిట్కాలు పాటించినా, ఏ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించినా కొంతమందిలో ఈ సమస్య తగ్గట్లేదు. అయితే ఇలా ఎక్కువగా కష్టపడకుండా చిన్న చిన్న చిట్కాలు పాటించినా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని అంటున్నారు నిపుణులు.

ఏవి చేయాలి..? ఏవి చేయకూడదు..?

కాస్త ట్రిమ్ చేయక తప్పదు. బయట కాలుష్యం వల్ల జుట్టులో ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ రావడం సహజం. కానీ వాటిని అలా వదిలేస్తేనే జుట్టు పెరుగుదలకు అవి బ్రేక్ వేస్తాయి. అందుకే నెలకొకసారి లేదా రెండు నెలలకొకసారి అయినా వాటిని ట్రిమ్ చేస్తూ ఉండాలి.

ఈరోజుల్లో ఉన్న కాలుష్యం వల్లే దాదాపు చాలావరకు జుట్టు సమస్యలు వస్తున్నాయి. అందుకే ఎండకు, దుమ్ముకు జుట్టును వదిలేయకూడదు. ఎక్కువగా ఎండ దాని మీద పడకుండా కవర్ చేసుకోవాలి. సూర్యుడి నుండి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ జుట్టుకు అంత మంచివి కావు.

షాంపూను ఎక్కువ ఉపయోగించిన మంచిది కాదు.. అలా అని తక్కువగా ఉపయోగించినా మంచిది కాదు. అందుకే షాంపును సమపాళ్లలో వాడాలి. ఎక్కువగా షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు చాలా డ్రై అయిపోతుంది. ఒకవేళ తక్కువ వాడితే జుట్టులో జిడ్డుతనం ఎక్కువవుతుంది.

ఈమధ్య స్ట్రయిట్‌నర్స్, కర్లింగ్ ఐరన్స్ లాంటి జుట్టుపై చాలానే ఉపయోగిస్తున్నాం. కానీ అలాంటివి హెయిర్ కేర్‌కు అస్సలు మంచిది కాదని ముందు నుండి తెలిసిన విషయమే. అందుకే వాటికి వీలనైంత వరకు దూరంగా ఉంటే మంచిది.

పోనీటెయిల్.. ఎన్ని సంవత్సరాలైనా ఔట్‌డేటెడ్ కాని ఒక హెయిర్ స్టైల్ ఇది. కానీ పోనీటెయిల్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎలా అంటారా.. జుట్టును అలా గట్టిగా ముడేయడం వల్ల చాలాసేపు జుట్టు లాగుతున్నట్టుగా ఒత్తిడికి గురవుతుంది. దాని వల్ల ట్రాక్షన్ అలోపేసియా అనే కండీషన్ మొదలవుతుంది.

అప్పుడే తలస్నానం చేసి జుట్టును దువ్వడం అంత మంచిది కాదు. పైగా తడి జుట్టును గట్టిగా తుడవకూడదు కూడా. పచ్చిగా ఉన్న జుట్టును దువ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ మాత్రమే కాకుండా ఇతర జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి.

Tags:    

Similar News