Hair Fall Tips In Telugu: జుట్టు రాలడం ఆపడానికి ఇంట్లోనే హెయిర్ ప్యాక్

Hair Fall Tips In Telugu: ప్రస్తుతం యూత్‌ను అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తున్న సమస్య జుట్టు రాలడం.

Update: 2021-09-29 06:08 GMT

Hair Fall Tips In Telugu: ప్రస్తుతం యూత్‌ను అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తున్న సమస్య జుట్టు రాలడం. ఆడ, మగ అని తేడా లేదు.. వయసుతో సంబంధం లేదు.. అందరిలో ఈ జుట్టు రాలడం సమస్య కామన్‌గా కనిపిస్తుంది. దీనికోసం హెయిర్ ట్రీట్‌మెంట్ అంటే.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే జుట్టు రాలే సమస్యకు ఇంట్లో ఉన్న రెమెడీతోనే చెక్ పెట్టేయొచ్చు. అది ఎలా అని ఇప్పుడు చూసేయండి.

దీనికోసం ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు స్పూన్ల మెంతి పిండి, రెండు స్పూన్ల వేపాకు పొడి, రెండు స్పూన్ల ఉసిరి కాయ పొడి, రెండు పెద్ద గేరేటెల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ను తలకు పట్టించి అరగంటయ్యాక నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

మెంతి పిండి లో ఉండే నికోటిన్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. వేపాకులలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన తలలో చుండ్రు, దురద తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఉసిరి పొడి జుట్టు రాలడం, తెల్ల జుట్టు రావటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు తల పైన చర్మం శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ఇలా ఈ ప్యాక్ జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటే 2 సార్లు, తక్కువ ఉంటే ఒకసారి వేస్తే జుట్టు రాలే సమస్య క్రమంగా తొలగిపోతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Tags:    

Similar News