Health Tip for Diabetes: షుగర్ పేషెంట్స్ ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే నో ప్రాబ్లమ్..

Health Tip for Diabetes: నవరాత్రులు మొదలయిపోయాయి. చాలామంది ఉపవాసాలు ఉంటూ నిష్ఠతో అమ్మవారిని కొలుస్తారు.

Update: 2021-10-12 03:38 GMT

Health Tip for Diabetes: నవరాత్రులు మొదలయిపోయాయి. చాలామంది ఉపవాసాలు ఉంటూ నిష్ఠతో అమ్మవారిని కొలుస్తారు. కానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారు, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం ఉండడం మంచిదేనా అన్న సందేహం చాలామందికి ఉంది.

ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారు, ఇన్సులిన్ తీసుకుంటున్న వారు హైపోగ్లికేమియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. హైపోగ్లికేమియా అంటే శరీరంలో షుగర్ లెవెల్స్ ఉన్నట్టుండి పడిపోవడం. ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ డైట్‌లో ఉండాల్సిన షుగర్ పేషెంట్లు ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. ఈ ప్రశ్నలకు ఇవే సమాధానాలు..

షుగర్ లెవెల్స్ జాగ్రత్త.. ఉపవాసంలో ఉన్నా కూడా అప్పుడప్పుడు బటర్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, పెరుగు, మఖానా తీసుకోవడం.. షుగర్ పెషెంట్స్ డైట్‌ను ఫాలో అయినదానితోనే సమానం. ఇన్సులిన్ తీసుకుంటున్న వారు ఉపవాసం చేసే ముందు వారికి హైపోగ్లికేమియా సమస్య తలెత్తదు అనుకుంటేనే దానికి సిద్ధమవ్వాలి. అప్పటికీ షుగర్ లెవెల్స్ నిలకడగా లేకుంటే మీరు ఉపవాసం చేయకుండా ఉంటే మంచిదని మీ డాక్టర్ సూచించే అవకాశాలు ఉన్నాయి.

హైడ్రేటెడ్‌గా ఉండండి.. షుగర్ పేషెంట్స్ ఎప్పుడూ డీ హైడ్రేషన్‌కు గురికాకూడదు. ముఖ్యంగా ఉపవాసం సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండడం మరింత ముఖ్యం. అలా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. రెండు, మూడు లీటర్ల నీళ్లతో పాటు ఉప్పు లేకుండా మజ్జిగ, కొబ్బరినీళ్లు లేదా ఇంట్లో చేసిన వెజ్ సూప్ కూడా మీరు హైడ్రేటెడ్‌గా ఉండడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాకుండా షుగర్ లేకుండా నిమ్మకాయ నీళ్లు కూడా మంచి ఆప్షన్.

నూనెలో వేయించినవి వద్దు.. రాగి పిండితో చేసిన వంటకాలు లంచ్, డిన్నర్‌కు తీసుకోవడం డయాబెటీస్ పేషెంట్స్‌కు చాలా మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువ, గ్లికెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. గ్లికెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్‌తో సమానం. అది ఎంత ఎక్కువగా ఉంటే డయాబెటిక్ పేషెంట్స్‌కు అంత ఎక్కువ ప్రమాదకరం. నూనెలో వేయించిన పూరీల కంటే చపాతీలు, రొట్టెలు తీసుకోవడం మంచిది. వాటిలోకి ఆకు కూరలు, సలాడ్‌లాంటివి తింటే బెటర్.

సాయంత్రం స్నాక్స్.. సాయంత్రం వేళ్లలో మఖానా, బాదాం, వాల్నట్ లాంటివి తీసుకోవడం వల్ల మీకు ఉపవాసం ఉన్నా కూడా ఎక్కువగా అలసట అనిపించదు. పైగా అవి మీ డయాబెటిక్ డైట్‌ను కరెక్ట్‌గా మెయింటెయిన్ చేయగలుగుతాయి.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ.. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉపవాసం చేయవచ్చు. అమ్మవారిని నిష్ఠగా పూజించవచ్చు

Tags:    

Similar News