Heart Attack Symptoms : గుండెపోటును ఇలా గుర్తించండి..

Heart Attack Symptoms : గుండెపోటు‌ను త్వరగా గుర్తించగలిగితే పెనుప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

Update: 2022-07-08 12:30 GMT

Heart Attack Symptoms : గుండెపోటు‌ను త్వరగా గుర్తించగలిగితే పెనుప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని సార్లు గుండెపోటు వచ్చే ముందు అజీర్ణం, ఆసిడిటీ పెరగినట్లు అనిపిస్తుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయి. గుండెపోటు వచ్చే ముందు..వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయనేదానిని తెలుసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి సులువుగా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలనుబట్టి ప్రతీ సంవత్సరం 1 కోటి 70 లక్షల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వీటిలో ఎక్కువ కేసుల్లో గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడినా పట్టించుకోకపోవడం వల్ల లక్షల ప్రాణాలు పోతున్నాయి. సరైన సమయంలో గుండెపోటు లక్షణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.


అజీర్తి వల్ల కడుపులో చాతిలో వేడిపుట్టినట్లు అనిపిస్తుంది. ఈ వేడి గుండెపోటును కూడా సూచించే అవకాశం ఉంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల రక్త సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయి. అజీర్తివల్ల కొన్ని ఆసిడ్స్ గొంతు వరకు విడుదల అవుతాయి. దీని వల్ల కూడా గుండెకు సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం ఛాతి మధ్యలో నొప్పిని కూడా గుండెపోటుగా అర్ధం చేసుకోవాలంటున్నారు. ఛాతిలో మంట లేదా నొప్పి ఉన్నా వెంటనే టెస్టులు చేయించుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.


అమెరికన్ హర్ట్ అసోసియేషన్ సర్వేనుబట్టి గుండెపోటుకు ముందు వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తయంటున్నారు. ఆ సమయంలో గుండె శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్, రక్తాన్ని పంప్ చేయలేదని, దీని వల్ల కడుపులో పీహెచ్ లెవెల్స్ తగ్గి వాంతులు అయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, చలిచెమటలు వచ్చినా, ఆందోళన కలిగినా వెంటనే దాన్ని గుండెపోటు లక్షణంగా గుర్తించి వైద్యుడిని సంప్రదించాలి.


అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌ పరిశోధకులు గుండెపోటుకు దారితీసే పరిస్థితులను కనుగ్గొన్నారు. వయసు పెరుగుదల, వంశపారంపర్యం, పొగ త్రాగడం, మధ్యం సేవించడం, లైఫ్‌స్టైల్, హైపర్ టెన్షన్, అధిక బరువు, వత్తిడికి లోనవడం లాంటివి గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు. వీటిలో ఏ లక్షణం కనబడినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Tags:    

Similar News