Hot-water Bath : వేడి నీళ్ల స్నానంతో కరోనా రాదా?

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

Update: 2021-05-13 05:13 GMT

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వైరస్ మరణిస్తుందని తెలిపింది. గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో ఉప్పు, పసుపు వేసుకుని పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని తెలిపింది. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం వంటి జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాకుండా చూసుకోవచ్చంది. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లునొప్పులు తగ్గుతాయి. మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News