Prevent Burping: ఇబ్బంది పెడుతున్న త్రేన్పులు.. ఇంటి చిట్కాలతో నివారణ

Prevent Burping: లేటుగా తినడం లేటుగా పడుకోవడం.. లేదంటే మసాలా వంటలు.. శరీరానికి వ్యాయామం లేకపోవడం ఇవన్నీ అనారోగ్య హేతువులు..

Update: 2022-06-20 08:23 GMT

Preventing Burping: లేటుగా తినడం లేటుగా పడుకోవడం.. లేదంటే మసాలా వంటలు.. శరీరానికి వ్యాయామం లేకపోవడం ఇవన్నీ అనారోగ్య హేతువులు..ఈ విధమైన జీవనశైలి కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సంబంధిత సమస్యలతో పాటు త్రేన్పులు ఇబ్బంది పెడుతుంటాయి. అందరి మధ్యలో ఉన్నా ఆగని త్రేన్సులు ఓ రకంగా చికాకుని కలిగిస్తాయి. కొన్ని ఇంటి చిట్కాలు ప్రయత్ని చూడండి.. వీటితో పాటు జీవన శైలిని కూడా మార్చుకుంటే చాలా వ్యాదులకు చెక్ పెట్టవచ్చు.

చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టే అంశమే అయినప్పటికీ.. తినే, త్రాగే సమయంలో మింగిన గాలిని బయటకు పంపడానికి త్రేన్పులు వస్తుంటాయి. ఇవి కొందరికి సహజంగా, మరికొందరికి అసహజంగా బయటకు వస్తుంటాయి. లోపలికి తీసుకున్న గాలి అన్నవాహిక పైకి తిరిగి ప్రయాణిస్తుంది. ఆసమయంలో వచ్చే చిన్నపాటి అరుపులనే త్రేన్పులు అంటారు.

పిండిపదార్థాలు, చక్కెర లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియ లేదా గుండెల్లో మంట సమస్యలకు కారణం కావచ్చు. ఆహారం తిన్న తర్వాత కనీసం ఓ వంద అడుగులు వేయాలి. శారీరక శ్రమ జీర్ణక్రియకు సహాయపడుతుంది. గాలిని బయటకు పంపించే కొన్ని ఆసనాలు ప్రయత్నించాలి.

త్రేన్పులను తగ్గించడంలో అల్లం అద్భుతంగా పని చేస్తుంది. భోజనం చేసిన గంట, రెండు గంటల తరువాత అల్లం టీ తాగాలి. మరికొన్నింటిని కూడా ప్రయత్నించండి.

నెమ్మదిగా తినడం, త్రాగడం చేయాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు. డ్రింక్స్ వంటివి తీసుకునేటప్పుడు స్ట్రా ఉపయోగించకపోవడం మంచిది.

కార్బొనేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి. కార్బన్ డయాక్సైడ్ వాయువు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. గ్యాస్ కు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. పప్పు, బ్రొకలీ, ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యాలీప్లవర్, చపాతీలు, అరటిపండ్లు, చక్కెర సంబంధిత పదార్థాలు, పాలు, గుండెల్లో మంట కలిగించే ఆహారాలు, పుల్లని పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.

బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది.. పండిన బొప్పాయి ముక్కలు రోజూ ఓ కప్పు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇక భోజనంలో పెరుగు కంటే పల్చని మజ్జిగ తీసుకోవడం, అందులో కాస్త జీలకర్ర పొడి కలిపి తాగడం వంటివి చేయాలి. 

ఆహారం తిన్న తరువాత సోంపు గింజలు నోట్లో వేసుకుని నమిలితే అవి జీర్ణ క్రియకు తోడ్పడుతాయి. లేదంటే నీటిలో సోంపు వేసి మరగబెట్టి ఆ నీళ్లను రోజుకు రెండు సార్లు తాగినా త్రేన్సుల సమస్యను నివారించవచ్చు. 

Tags:    

Similar News