Green Tea: రోగనిరోధక శక్తిని పెంచే గ్రీన్ టీ..
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.;
Green Tea: గ్రీన్ టీ కాఫీ కన్నా మంచిదా?
ఉదయాన్నే మనలో చాలా మందికి ఓ కప్పు వేడి వేడి కాఫీ లేదా టీ కడుపులో పడందే కాలు కదలదు. చురుగ్గా ఏ పనీ చేయాలనిపించదు. అయితే, ప్రస్తుతం ప్రబలుతున్న కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. అందుకోసం ఓ కప్పు గ్రీన్ టీని తాగమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
గ్రీన్ టీ పౌడర్ ఎక్కడ నుండి వచ్చింది..
గ్రీన్ టీ చైనాకు చెందినది. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిన పండిస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన టీలలో గ్రీన్ టీ ఒకటి. వేర్వేరు టీలు వేర్వేరు రోగాలకు సహాయపడతాయి. కాని గ్రీన్ టీని "సూపర్ టీ" అని పిలుస్తారు. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.