ఇంట్లో వండిన భోజనం తిని ఇంత స్లిమ్ గా .. కేవల 6 నెలల్లో 32 కిలోల బరువు
బరువు తగ్గడం వలన తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని కోపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలో పంచుకుంది.;
బరువు తగ్గడం వలన తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని కోపాల్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలలో పంచుకుంది.
హార్మోన్స్ ఇంబాలెన్స్ వలనో, జీన్స్ వలనో లేదా అతిగా తినడం వలనో బరువు పెరుగుతుంటారు చాలా మంది. బరువు తగ్గే ప్రయత్నాలు చాలానే చేస్తున్నా మధ్యలోనే వాటికి చెక్ పెట్టేస్తుంటారు.. లోపల బలంగా ఉంటే బరువు తగ్గాలని ఖచ్చితంగా తగ్గుతారు.. కాకపోతే కాస్త నోరు కట్టడి చేసుకోవాలి. బయటి ఫుడ్ జోలికి అసలు వెళ్లకూడదు.. అదే చేసింది కోపాల్ అగర్వాల్.. ఇంతకు ముందు తన బాడీ తనకే బరువుగా ఉండేదని, ఇప్పుడు తన షేప్ ని తానెంతో ఇష్టపడుతున్నానని ఇన్ స్టాలో షేర్ చేసింది. అన్నట్టు డైట్ ప్లాన్ కూడా షేర్ చేసిందండోయ్.. ఇంకేం మీరు కూడా ఫాలో అయిపోవచ్చు.. అదేంటో చూద్దాం..
ఇరవై నాలుగేళ్ల కోపాల్ అగర్వాల్ తన అద్భుతమైన బరువు తగ్గించే ప్రయాణం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించింది. ఆమె బరువు 101 కిలోల నుండి 61 కిలోలలకు తగ్గించుకుంది. ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆమె ఈ విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం UKలో చదువుతున్న కోపాల్, తన వీడియోలలో ఒకదానిలో చూసినట్లుగా, తనకు మోడ్రన్ దుస్తులను ధరించడం చాలా ఇష్టమని చెబుతుంది. గతంలో, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల తాను సాధారణ దుస్తులను మాత్రమే ధరించానని ఆమె పంచుకుంది. బరువు తగ్గడం వల్ల తన శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా తన మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిందని, దాంతో తన ఆత్మగౌరవం కూడా మెరుగుపడిందని ఆమె చెప్పింది.
బరువు తగ్గడానికి రోజువారీ ఆహారం: బరువు తగ్గడానికి ఆమె ఏమి తింటుందో వివరించే నమూనా ఆహార ప్రణాళికను కూడా కోపాల్ పంచుకుంది :
అల్పాహారం: ఒక రోటీతో 5 గుడ్లలోని తెల్లసొన ఆమ్లెట్ వేసుకుని తినేది.. దాంతో పాటుగా 1 గిన్నె పోహా, 2 పనీర్ ముక్కలు, పండ్లముక్కలతో కూడిన అధిక ప్రోటీన్ ఉన్న పెరుగు ఒక కప్పు.
మధ్యాహ్నం: పుచ్చకాయ, స్ట్రాబెర్రీలు,బ్లాక్ కాఫీ, కొబ్బరి నీళ్లు
భోజనం:100 గ్రాముల చికెన్ తో ఆకుపచ్చ కూరగాయలు,పెరుగుతో కిచిడి, ఆకుపచ్చ కూరగాయలతో పనీర్ భుర్జీ
సాయంత్రం: గ్రీన్ టీ
రాత్రి భోజనం: పచ్చి కూరగాయలతో వేయించిన పనీర్ సలాడ్, 100 గ్రాముల చికెన్ బుర్జీ
కోపాల్ ఈ నాలుగు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోల బరువు తగ్గానని చెప్పింది. జీవక్రియను మెరుగుపరచడానికి త్వరగా పడుకుని త్వరగా మేల్కొనండి. ప్రతిరోజూ కనీసం మూడు లీటర్ల నీరు త్రాగాలి. గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించాలి. చురుకైన జీవనశైలిని నిర్వహించడం, రోజుకు కనీసం 10,000 అడుగులు నడవడం. చక్కెర, జంక్ ఫుడ్ ను పూర్తిగా నివారించడం, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడం ద్వారా బరువు తగ్గొచ్చని వివరించింది.