Liver Diseases: అర్థరాత్రి భోజనం.. ఆల్కహాల్ తీసుకోవడం.. లివర్ వ్యాధులకు..

Liver Diseases: కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కాలేయ వాపుకు కారణమవుతుంది. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది.

Update: 2022-03-30 05:30 GMT

Liver Diseases: అర్థరాత్రి భోజనం.. ఆల్కహాల్ తీసుకోవడం.. ఆరోగ్యానికి ముప్పు అని తెలిసి కూడా చేస్తుంటారు.. వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు అంతగా పట్టించుకోం.. కానీ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే సరైన జీవన విధానం ఎంతైనా అవసరం.. మప చేతుల్లో ఉన్నవి కచ్చితంగా పాటించాలి.. సమయానికి ఆహారం, నిద్ర, వ్యాయామం వంటివి చేయాలి.

జీవనశైలిలో మార్పులు కాలేయ వ్యాధి పెరుగుదలను ప్రేరేపిస్తుందని కొత్త అధ్యయనం తెలిపింది. జపాన్‌లోని ఒసాకా సిటీ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలో జరిపిన అధ్యయనంలో కాలేయ వ్యాధి కేసులు పెరిగాయని వెల్లడించింది.

దీనికి సంబంధించిన వివరాలు లివర్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. అర్థరాత్రి భోజనం, ఆల్కహాల్ తీసుకోవడం, అలాగే మహమ్మారి సమయంలో ధూమపానం - కాలేయ వ్యాధి పెరుగుదలకు ప్రధాన కారణాలు.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు కాలేయ వాపుకు కారణమవుతుంది. ఇది మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగే వ్యక్తులలో, ఈ పరిస్థితిని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (AFLD) అని పిలుస్తారు. కాలేయ వ్యాధి పెరిగిన అన్ని కేసుల్లో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రాత్రి భోజనం నిద్రవేళకు 2 గంటల ముందు చేయాలి. ప్రతి రోజు అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ముఖ్యంగా లివర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అధ్యయనం కోసం, బృందం 2018 - 2020 మధ్య 973 మంది ఆరోగ్య డేటాను పరిశీలించింది.

పరిశోధకులు ప్రధానంగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులలో ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ పెరుగుదలను కనుగొన్నారు. కోవిడ్ మహమ్మారి కొనసాగుతున్నందున జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

Tags:    

Similar News