Miss World 2021: మిస్ వరల్డ్‌గా నిలిచిన పోలాండ్ బ్యూటీ.. సెమీ ఫైనల్స్‌లో తెలుగమ్మాయి..

Miss World 2021: మిస్ వరల్డ్ 2021 పోటీలు డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి.;

Update: 2022-03-17 05:18 GMT

Miss World 2021: ఏడాదికి ఒకసారి నిర్వహించే మిస్ వరల్డ్ పోటీల కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు మోడల్స్. వారి అందానికి, ఆత్మస్థైర్యానికి ప్రతీ ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం సొంతం కావాలని కోరుకుంటారు. అయితే ఈ సంవత్సరం మిస్ వరల్డ్‌గా నిలిచింది పోలాండ్ బ్యూటీ కరోలినా బైలాస్కా. అయితే తెలుగమ్మాయి మానసా వారణాసి కూడా ఎంతో కష్టపడి సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.

మిస్ వరల్డ్ 2021 పోటీలు డిసెంబర్‌లోనే జరగాల్సి ఉన్నా.. కోవిడ్ వల్ల వాయిదా పడ్డాయి. ఇక 70వ మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని దక్కించుకున్న కరోలినా బైలాస్కాకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. తన తరువాత ఫస్ట్ రన్నర్ అప్‌గా అమెరికాకు చెందిన శ్రీ సైనీ ఉంది. ఇక సెకండ్ రన్నర్ అప్‌గా కాట్ లివోరీ దేశానికి చెందిన ఒలీవియా ఏస్ ఉంది.

మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకొని మిస్ వరల్డ్ కూడా కావాలనుకున్న మానసా వారణాసి ఫైనల్స్ వరకూ కూడా చేరుకోలేకపోయింది. సెమీ ఫైనల్స్‌లో టాప్ 13 కంటెస్టెంట్స్‌లో తాను కూడా ఒకటిగా నిలిచిపోయింది. కానీ మిస్ వరల్డ్ పోటీల్లో సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లడం కూడా పెద్ద విషయమే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News